ఈ పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల ఉపాధి దొరుకుతుంది: బండి సంజయ్
- ఈ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందన్న బండి సంజయ్
- తెలంగాణ రాష్ట్రంలో రూ.340 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడి
- రైతులకు న్యాయం చేసేలా ఈ పథకం తెచ్చినట్లు వెల్లడి
ఈ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే ఈ పథకానికి అదనంగా రూ.17 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలుకు అదనంగా రూ.340 కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు న్యాయం చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్‌లో ఈ పథకం పనులు జరగవని, దీనివల్ల కూలీలు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.