Jagan Mohan Reddy: సార్లంకపల్లె గ్రామం అగ్నికి ఆహుతి కావడంపై జగన్ దిగ్భ్రాంతి

Jagan Mohan Reddy Shocked by Sarlankapalle Village Fire
  • సంక్రాంతి పండుగ సందర్భంగా సార్లంకపల్లె గ్రామంలో తీవ్ర విషాదం
  • మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు దగ్ధం
  • బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్న జగన్
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ గిరిజన గ్రామంలో 38 పూరిళ్లు దగ్ధం కావడం కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షణాల్లో ఊరంతా భస్మీపటలం కావడం విచారకరమని అన్నారు. 

బాధితులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలవాలని... వారికి వసతి, ఆహారం అందించాలని సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, కొత్త ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వరకు వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ప్రమాదం వివారాల్లోకి వెళితే... మన్యం మారుమూలన ఉండే ఈ తండాలో అగ్నిప్రమాదం సంభవించింది. నిమిషాల్లోనే ఊరంతా కాలి బూడిద అయిపోయింది. మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. అడవి తల్లిపై ఆధారపడి జీవించే గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరుకును కొనుగోలు చేసేందుకు తుని పట్టణానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఈ ఘోరం సంభవించింది. 50 కిలోమీటర్ల దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా అగ్నికి ఆహుతి అయిపోయింది.
Jagan Mohan Reddy
Sarlankapalle
Andhra Pradesh Fire Accident
Routhulapudi Mandal
Kakinada District
Tribal Village Fire
AP Government Relief
Fire Accident Compensation
YSRCP
Sankranti

More Telugu News