Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన... ఆరు గంటలకు పైగా నటుడు విజయ్‌ని ప్రశ్నించిన సీబీఐ

CBI Questions Actor Vijay for Over Six Hours in Karur Stampede Case
  • తొలిరోజు ముగిసిన విజయ్ సీబీఐ విచారణ
  • తొక్కిసలాట ఘటనకు టీవీకేకు సంబంధం లేదన్న విజయ్
  • పరిస్థితి చేయి దాటిపోకూడదని అక్కడి నుంచి వెళ్లిపోయానన్న విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ సీబీఐ తొలిరోజు విచారణ ముగిసింది. విజయ్‌ను ఆరు గంటలకు పైగా విచారించిన సీబీఐ అధికారులు, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సంక్రాంతి తర్వాత సీబీఐ మరోసారి ఆయనను విచారించనుంది. తొక్కిసలాట ఘటనకు టీవీకేకు ఎలాంటి సంబంధం లేదని ఆయన విచారణ సందర్భంగా అధికారులతో చెప్పినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆయన తెలిపారు.

ఇదే వ్యవహారంపై పార్టీ కార్యకర్తలను సీబీఐ ప్రశ్నించినప్పుడు కూడా వారు ఇదే తరహా సమాధానం చెప్పారని తెలుస్తోంది. విజయ్ నుంచి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. అయితే, పొంగల్ సందర్భంగా తనకు విరామం కావాలని విజయ్ కోరగా, సీబీఐ అందుకు అంగీకరించిందని సమాచారం. విజయ్ విచారణకు వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు పలు వివరాలు సేకరించారు.
Vijay
Vijay TVK
Karur stampede
Tamil Nadu politics
CBI investigation
TVK party
Actor Vijay

More Telugu News