Konijeti Rosaiah: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి కన్నుమూత

Konijeti Rosaiahs Wife Sivalakshmi Passes Away
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడిన రోశయ్య సతీమణి  
  • అమీర్‌పేటలోని నివాసంలో ఈ రోజు కన్నుమూసిన శివలక్ష్మి
  • అమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రముఖులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని అమీర్‌పేట నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఈ విషయం తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 
Konijeti Rosaiah
Sivalakshmi
Rosaiah wife
Former CM
Andhra Pradesh
Tamil Nadu Governor
Obituary
Hyderabad news
Political leader
Condolences

More Telugu News