China Manja: చైనా మాంజా చుట్టుకుని తీవ్రంగా గాయపడిన టెక్కీ

China Manja Injures Techie in Hyderabad
  • గచ్చిబౌలి - హఫీజ్‌పేట మార్గంలో ఘటన 
  • బైక్ పై వెళుతున్న చైతన్య అనే టెక్కీకి చుట్టుకున్న చైనా మాంజా
  • బాధితుడిని మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
నిషేధిత చైనా మాంజా మరో ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైతన్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేతికి మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన చేయి తెగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై గాలిలో వేలాడుతూ వాహనదారులకు ముప్పుగా మారుతోంది.

చైనా మాంజా కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో దేశంలో చైనా మాంజాపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినప్పటికీ వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో చిన్నా పెద్దా పతంగులు ఎగురవేస్తూ ఆనందిస్తున్న సమయంలో ఈ చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 
China Manja
Hyderabad
Gachibowli
Hafeezpet
Software Engineer
Bike Accident
Chinese Kite String
Kite Flying
Sankranti
Banned Manja

More Telugu News