AB Venkateswara Rao: త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao to Launch New Political Party Soon
  • రాష్ట్ర పురోగతే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు ఏబీవీ సన్నాహాలు
  • ఆర్థిక వనరులు సమకూర్చుకున్నాక అధికారికంగా ప్రకటిస్తానన్న ఏబీవీ 
  • ప్రజలందరి అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని స్పష్టీకరణ
రాష్ట్ర పురోగతి కోసం తన ఆలోచనలకు అనుగుణంగా ఉండేవారితో కలిసి త్వరలోనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’లో ఆయన ప్రసంగించారు.

గత ఏడాది ఏప్రిల్‌ 13న రాజకీయ ప్రవేశంపై చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, అప్పటి నుంచి పార్టీ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. తగిన ఆర్థిక శక్తిని సమకూర్చుకున్న తర్వాత పార్టీని ప్రారంభిస్తానని పేర్కొన్నారు. అలాగే, స్వేచ్ఛగా అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవడానికి విజయవాడలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం బలంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్‌ శక్తుల ఎదుగుదల మాత్రమే కాదని, సామాన్య ప్రజలందరూ ఆర్థికంగా ఎదగడమే నిజమైన దేశాభివృద్ధి అని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. 
AB Venkateswara Rao
New political party
Andhra Pradesh Politics
Retired IPS officer
Vijayawada
Political entry
State development
Financial strength
People's development

More Telugu News