Sanjay Nirupam: హిజాబ్ ధరించిన మహిళలు భారత్ కు ఎప్పటికీ ప్రధాని కాలేరు: ఒవైసీకి సంజయ్ నిరుపమ్ కౌంటర్

Sanjay Nirupam Counter to Owaisi on Hijab Wearing PM
  • హిజాబ్ ధరించిన మహిళ ఎప్పటికైనా భారత్ కు ప్రధాని అవుతారన్న ఒవైసీ
  • అది భారతదేశంలో మాత్రం కుదరదన్న సంజయ్ నిరుపమ్
  • అలాంటి కలలు ఉంటే ఒవైసీ పాకిస్థాన్‌కు వెళ్లాలని సూచన
ఎప్పటికైనా హిజాబ్ ధరించిన మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కాగలరని, కానీ అది భారతదేశంలో కాదని, పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌లో కావొచ్చని ఆయన అన్నారు. ఒవైసీకి అలాంటి కలలు ఉంటే, నాటి రజాకార్ల మాదిరిగా వెంటనే పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ హిజాబ్ ధరించిన మహిళను ప్రధానిని చేసేందుకు ప్రయత్నించాలని శనివారం ముంబైలో ఘాటుగా వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా సంజయ్ నిరుపమ్ విమర్శలు చేశారు. ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ దాడుల సమయంలో మమత అధికారిక విధులకు ఆటంకం కలిగించారని, ఇది రాజ్యాంగ వ్యవస్థను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. కేంద్ర ఏజెన్సీల విధులను అడ్డుకోవడం చాలా తీవ్రమైన విషయమని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

మరోవైపు, పవార్ కుటుంబంలో అంతర్గత విభేదాలు పరిష్కారమయ్యాయని అజిత్ పవార్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. పుణె, పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేస్తున్నాయని, ఇది విభేదాలు ముగిశాయనడానికి సంకేతమని అన్నారు. ఇది శుభపరిణామమని, భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి రూపు తీసుకుంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ గురించి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని నిరుపమ్ పేర్కొన్నారు.
Sanjay Nirupam
Asaduddin Owaisi
Hijab
India Prime Minister
Shiv Sena
Pakistan
West Bengal
Mamata Banerjee
Ajit Pawar
Sharad Pawar

More Telugu News