Ghattamaneni Jaya Krishna: ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్... ఘట్టమనేని జయకృష్ణకు మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్

Ghattamaneni Jaya Krishna Srinivasa Mangapuram First Look Released
  • ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి జయకృష్ణ ఎంట్రీ
  • అన్న రమేశ్ బాబు కొడుకు సినిమాకు మహేశ్ బాబు సపోర్ట్
  • ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన సూపర్ స్టార్
  • అజయ్ భూపతి దర్శకత్వంలో భారీ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మహేశ్ బాబు అన్నయ్య, దివంగత నటుడు రమేశ్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తుండడం తెలిసిందే. జయకృష్ణ నటిస్తున్న తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు శనివారం సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జయకృష్ణకు, చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. “‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణకు ఆల్ ది బెస్ట్. బలమైన టీమ్, ఆసక్తికరమైన ఆరంభం.. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అని మహేశ్ బాబు తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సీకే పిక్చర్స్ వంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఘట్టమనేని మూడో తరం వారసుడి ఎంట్రీ, దానికి తోడు ఇంత పెద్ద టీమ్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
Ghattamaneni Jaya Krishna
Srinivasa Mangapuram
Mahesh Babu
Ramesh Babu
Telugu cinema
Tollywood debut
Ajay Bhupathi
Raasha Thadani
GV Prakash Kumar
Vyjayanthi Movies

More Telugu News