SG: బంగ్లాదేశ్ క్రికెటర్లకు షాక్.. స్పాన్సర్‌షిప్‌కు భారత కంపెనీ గుడ్‌బై?

Bangladesh Cricketers Face Sponsorship Issues with SG Amidst Tensions
  • భారత్, బంగ్లాదేశ్ మధ్య ముదురుతున్న క్రికెట్ విబేధాలు
  • బంగ్లా ఆటగాళ్ల స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటున్న భారత సంస్థ ఎస్‌జీ!
  • కెప్టెన్ లిట్టన్ దాస్ సహా పలువురు కీలక ఆటగాళ్లపై ప్రభావం
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు క్రీడాకారుల స్పాన్సర్‌షిప్‌లపై పడింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ భారత క్రీడా పరికరాల తయారీ సంస్థ 'ఎస్‌జీ' (SG) బంగ్లాదేశ్ క్రికెటర్లతో స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వివాదానికి బీజం ఐపీఎల్‌లో పడింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భద్రతా కారణాలు చూపుతూ.. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది.

ఎస్‌జీ సంస్థ ప్రస్తుతం బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్, యాసిర్ రబ్బీ, మోమినుల్ హక్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఒప్పందాల పునరుద్ధరణ ఉండదని కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఆటగాళ్ల ఏజెంట్లకు ఈ విషయంపై సూచనలు అందినట్లు సమాచారం. "రాబోయే రోజుల్లో ఇదే జరిగే అవకాశం కనిపిస్తోంది" అని ఓ బంగ్లా క్రికెటర్ telecomasia.net తో చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.

SG
Litton Das
Bangladesh cricket
sports sponsorship
India Bangladesh relations
T20 World Cup
Mustafizur Rahman
Kolkata Knight Riders
BCB

More Telugu News