Kandararu Rajeevaru: శబరిమల బంగారం చోరీ కేసు.. ప్రధాన పూజారి అరెస్టు

Kandararu Rajeevaru Arrested in Sabarimala Gold Theft Case
  • ప్రధాన పూజారి రాజీవరును అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం
  • ఈరోజు వేకువజామున అదుపులోకి తీసుకుని విచారించిన సిట్
  • ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టు
కేరళలోని శబరిమల ఆలయంలో జరిగిన బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. రాజీవరును ఉదయం ఒక గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి విచారించి, మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి తరలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అతడి అరెస్టును ప్రకటించారని సమాచారం.

శబరిమల ఆలయంలోని విగ్రహాలకు బంగారు తాపడం చేశాక బరువులో తేడా రావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు తాజాగా ప్రధాన పూజారిని అరెస్టు చేయడం ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం వేకువజామున 4.30 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి హెచ్ వెంకటేశ్ నేతృత్వంలో ప్రధాన పూజారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సిట్ బృందం ప్రధాన పూజారిని అరెస్టు చేసింది.
Kandararu Rajeevaru
Sabarimala
Sabarimala Temple
Kerala
Gold theft case
Unnikrishnan Potti

More Telugu News