Navdeep: హీరో నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
- డ్రగ్స్ కేసులో నవదీప్ కు భారీ ఊరట
- నవదీప్ వద్ద డ్రగ్స్ లభించలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది
- ఆధారాలు లేకుండా కేసును కొనసాగించలేమన్న హైకోర్టు
డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు పెద్ద ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన ఈ కేసులో నవదీప్ వద్ద ఎలాంటి మత్తుపదార్థాలు దొరకలేదన్న అంశాన్ని కోర్టు స్పష్టంగా గుర్తించింది.
నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ వెంకట సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ కేసులో నవదీప్ పేరు కేవలం ఎఫ్ఐఆర్ లో మాత్రమే ఉందని, సంఘటన జరిగిన ప్రదేశంలో ఆయన వద్ద డ్రగ్స్ ఏవీ లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో నవదీప్‌కు సంబంధించిన ఆధారాలు లేవని వివరించారు.
ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సరైన ఆధారాలు లేకుండా కేసు కొనసాగించడం సరికాదని పేర్కొంది. నవదీప్ వద్ద డ్రగ్స్ లభించనందున, ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నవదీప్‌కు చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్టయింది.