Ambati Rayudu: 40 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రైన అంబటి రాయుడు.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రాయుడు అర్ధాంగి విద్య
- కుటుంబంతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రాయుడు
- ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు
- తెలుగు ప్లేయర్‌కు సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఇంట సంబరాలు నెలకొన్నాయి. ఆయన మూడోసారి తండ్రయ్యాడు. రాయుడు అర్ధాంగి విద్య సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని రాయుడు స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య, నవజాత శిశువుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. 'మాకు అబ్బాయి పుట్టాడు.. దేవుడి ఆశీస్సులు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అంబటి రాయుడు, విద్యలకు 2009లో వివాహం జరిగింది. 2020లో ఈ దంపతులకు మొదటి కుమార్తె వివియా జన్మించగా, 2023లో రెండో కుమార్తె పుట్టింది. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో రాయుడు మూడో బిడ్డగా కుమారుడికి తండ్రయ్యాడు. ఈ వార్త తెలియగానే సహచర క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాయుడు దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
2023లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి, వైసీపీ, జనసేన పార్టీలలో కొద్దికాలం పాటు కొనసాగాడు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ, కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే, కామెంట్రీలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాయుడు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.