Prahlad: అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు.. నాలుగో కాన్పుకు సిద్ధమైన భార్య... భర్త ఆత్మహత్య!

Prahlad Commits Suicide Due to Family Financial Issues in Kamareddy
  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్ దుబ్బాకు గ్రామంలో ఘటన
  • రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ప్రహ్లాద్‌
  • పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న ప్రహ్లాద్  
కుటుంబ పోషణ భారం కావడం, భవిష్యత్తుపై బెంగతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్కూర్ మండలం వీరాపూర్ దుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30), సౌందర్య దంపతులకు స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ప్రహ్లాద్, ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు, వారి చదువులు, వివాహాల గురించి తీవ్రంగా ఆలోచించేవాడు. ఈ క్రమంలో సౌందర్య మళ్లీ గర్భవతి అయింది. ఆమె ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఈ నెల 26లోపు కాన్పు జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. నాల్గవ సంతానం కూడా కుమార్తె అవుతుందనే భయంతో ప్రహ్లాద్ కుటుంబ సభ్యుల ముందే విషం తాగాడు.

వెంటనే కుటుంబ సభ్యులు అతడిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రహ్లాద్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రహ్లాద్ గతంలో కూడా మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు కాపాడినట్లు సమాచారం. 
Prahlad
Kamareddy district
Suicide
Debt
Financial problems
Girl children
Telangana news
Beerkur
Nizamabad
Family problems

More Telugu News