Telangana Weather: తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత.. ఏపీలో 9 నుంచి వర్షాలు!

Telangana Weather Cold Wave to Return to Telangana
  • నేటి నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా తగ్గనున్న రాత్రి ఉష్ణోగ్రతలు
  • రాబోయే రెండు రోజులు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం
  • డిసెంబర్ మొదటి వారంలో నెలకొన్న కోల్డ్‌వేవ్ పరిస్థితులు పునరావృతం
  • బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత మళ్లీ పెరగనుంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు (జనవరి 5-12 వరకు) రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గజగజ వణికించేలా చలిగాలులు వీస్తాయని, డిసెంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి 'కోల్డ్‌వేవ్' పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయని పేర్కొన్నారు.

రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25-26 డిగ్రీల మధ్యనే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Telangana Weather
Hyderabad Weather
Cold Wave
Telangana Cold Wave
Andhra Pradesh Rains
Rayalaseema Rains
IMD Hyderabad
Weather Forecast
Telangana Temperature
Rain Alert

More Telugu News