Pawan Kalyan: పవన్ కల్యాణ్ విషయంలో ఆ రోజు జరిగింది అదృష్టం కాదు.. అంజన్న అద్భుతం: దాసోజు శ్రవణ్

Pawan Kalyan Survival Anjanna Miracle Says Dasoju Shravan
పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై స్పందించిన దాసోజు శ్రవణ్
పునర్జన్మనిచ్చిన అంజన్నకు భక్తితో కూడిన కృతజ్ఞతలు తెలిపారంటూ ప్రశంస
దీక్షా విరమణ మండపం, సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై హర్షం
2009లో హుస్నాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రాణాలతో బయటపడటం కేవలం అదృష్టం కాదని, సాక్షాత్తు కొండగట్టు అంజన్న చూపిన ఒక అద్భుతమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.

పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నకు భక్తితో కూడిన కృతజ్ఞత తెలిపారంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. ఆ రోజు తాను ప్రాణాలతో బయటపడటం వెనుక కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉన్నాయనే గట్టి నమ్మకంతో, అచంచలమైన భక్తి విశ్వాసాలతో తనకి పునర్జన్మనిచ్చిన ఆ క్షేత్రంపై కృతజ్ఞతతో, ఆలయ అభివృద్ధి కోసం రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో దీక్షా విరమణ మండపం మరియు సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.

ఇందుకు తెలంగాణ ప్రజల పక్షాన పవన్ కల్యాణ్‌కు దాసోజు శ్రవణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆధ్యాత్మికతను, సామాజిక బాధ్యతను చాటుతూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంజన్న ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరుకు చొరవ చూపి సహకరించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కూడ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan
Kondagattu Anjanna
Dasoju Shravan
Janasena
Telangana News
Andhra Pradesh

More Telugu News