Sandeep Reddy Vanga: 'ఏ నేకెడ్ ట్రూత్' ట్యాగ్‌లైన్‌తో ఉన్న 'దిల్ దియా' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందీప్ రెడ్డి వంగా
- హీరో చైతన్య, దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్లో 'దిల్ దియా' చిత్రం
- బట్టలు లేకుండా సోఫాలో కూర్చున్న చైతన్య
- చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన సందీప్ వంగా
టాలీవుడ్‌లో ప్రత్యేక కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో చైతన్య రావు మదాడి మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ కొత్త సినిమా పేరును ‘దిల్ దియా’గా ఖరారు చేసి, దానికి ‘ఏ నేకెడ్ ట్రూత్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈరోజు విడుదల చేసి, యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్ లుక్ రిలీజ్ వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లో చైతన్య రావు పూర్తి రా అండ్ రూటెడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన బట్టలు లేకుండా సోఫాలో కూర్చుని ఉన్న ఫొటో, వెనుక నుంచి వచ్చే ప్రొజెక్టర్ లైటింగ్‌తో, ఆయన కళ్లలోని సీరియస్‌నెస్, ఇంటెన్స్ ఎమోషన్ సినిమా ఎంత భీభత్సమైన సన్నివేశాలను చూపబోతోందో స్పష్టంగా చెబుతోంది. ‘ఏ నేకెడ్ ట్రూత్’ అనే ట్యాగ్‌లైన్, ఈ సినిమా నిజానికి దగ్గరగా, కఠినమైన వాస్తవాన్ని చూపించేలా ఉంటుందని హింట్ ఇస్తోంది.
ఈ సినిమా పూర్ణ నాయుడు ప్రొడక్షన్, శ్రియాస్ చిత్రాస్ బ్యానర్లపై నిర్మించబడుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రా అండ్ రూటెడ్ ఎమోషనల్ డ్రామాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి రా సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.