Hyderabad drunk driving: న్యూ ఇయర్ వేళ, మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు

Hyderabad Drunk Driver Creates Ruckus for Nampally Police on New Year
  • నిన్న రాత్రి నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
  • నాంపల్లి పోలీసులకు విచిత్ర అనుభవం
  • తన బైక్ తనకు ఇవ్వాలంటూ తలకు గోడకేసి బాదుకున్న యువకుడు
  • పోలీసు అధికారి ఎంతగా సర్ది చెప్పినా ఏడుస్తూ ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు
నూతన సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒక యువకుడు పోలీసులపైనే దౌర్జన్యానికి దిగాడు. మద్యం సేవించి వచ్చిన అతను తన బైక్‌ను తిరిగి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

తన బైక్ తనకు ఇప్పించాలని తలను గోడకేసి బాదుకున్నాడు. బైక్ తాళం చెవి ఇవ్వాలని, లేకపోతే తనకు కోపం వస్తోందని పోలీసులతో అన్నాడు. ఒక పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. మీ తండ్రి పేరేమిటని అడిగితే, బైక్ సీటుపై చేయితో గట్టిగా కొడుతూ సమాధానం దాటవేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఏడుస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు.
Hyderabad drunk driving
Nampally police
New Year Hyderabad
Drunk and drive
Hyderabad traffic police

More Telugu News