AP Government: అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

AP Government Receives High Court Notice on Illegal Construction Regularization
  • ఆక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్  
  • పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సంబందిత శాఖలను ఆదేశించిన ధర్మాసనం
  • విచారణ నాలుగు వారాలకు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా, చంద్రారెడ్డిపల్లె గ్రామానికి చెందిన చిన్నబోయిన హరికృష్ణ హైకోర్టును ఆశ్రయించారు.

హరికృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందిస్తూ విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, పురపాలక శాఖ కమిషనర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. 
AP Government
Andhra Pradesh
Illegal Constructions
High Court
Chinnaboyina Harikrishna
Prakasham District
Building Regularization
Town and Country Planning

More Telugu News