Kesi Reddy Vimala: కోతులను తరిమే ప్రయత్నంలో... జారిపడి మృతి చెందిన మహిళ

Woman Dies After Falling While Trying to Ward Off Monkeys in Karimnagar
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో విషాదం
  • కోతులు ఇంట్లోకి వెళ్తాయనే భయంతో వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన మహిళ
  • ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన మహిళ
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపు ఒక్కసారిగా మీదకు రావడంతో ఒక మహిళ కిందపడి మృతి చెందారు. లింగాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల (59) అనే మహిళ ఇంటి ముందు ఈరోజు ఉదయం కోతులు గందరగోళం సృష్టించాయి.

ఆ కోతులు ఇంట్లోకి ప్రవేశిస్తాయేమోనన్న భయంతో ఆమె వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కోతులు ఆమెపైకి దూకే ప్రయత్నం చేయడంతో ఆమె అదుపుతప్పి కిందపడ్డారు. ఇంటిముందున్న సిమెంటు నేలపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందారు.
Kesi Reddy Vimala
Karimnagar
Lingapur
Monkey attack
Woman dies
Accidental death

More Telugu News