Muralidhar Goud: ఇవేం పెళ్లిళ్లు .. ఇవెక్కడి దారుణాలు?: 'బలగం' మురళీధర్ గౌడ్!

Muralidhar Goud Interview
  • పరిస్థితులు బాగోలేవన్న మురళీధర్ గౌడ్
  • పెళ్లిళ్లు నిలబడటం లేదంటూ ఆవేదన 
  • పెద్దవాళ్లు లేకపోవడమే కారణమని వ్యాఖ్య 
  • మితిమీరిన స్వేచ్ఛ పట్ల అసంతృప్తి

'బలగం' సినిమాతో మరింత పాప్యులర్ అయిన నటుడు మురళీధర్ గౌడ్. కేరక్టర్ ఆర్టిస్టుగా ఇప్పుడు ఆయన చాలా బిజీ. తాజాగా 'సిగ్నేచర్ స్టూడియోస్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి మాట్లాడారు. ముఖ్యంగా పెళ్లిళ్లు .. వైవాహిక జీవితాన్ని గురించి ఆయన స్పదించారు. 'ఇప్పుడు సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పెళ్లి చేసుకున్నవారు కొన్ని వారాల పాటు కలిసి ఉండటం కష్టమైపోతోంది" అని అన్నారు. 

"రీసెంటుగా నాకు బాగా తెలిసిన ఒక సంఘటన గురించి చెబుతున్నాను. అబ్బాయి - అమ్మాయి ఇద్దరూ బాగా చదువుకున్నవారు .. డబ్బున్న వారు కూడా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్దవాళ్లు పెళ్లి చేశారు .. హనీమూన్ కి పంపించారు. కానీ అక్కడి నుంచి చెరో ఫ్లైట్ లో వాళ్లు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇక విడిపోకుండా .. వేరుగా  వెళ్లిపోకుండా కలిసి ఉన్నట్టుగా కనిపించేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువనే" అని అన్నారు. 

"భార్యాభర్తలు ఈ స్థాయిలో విడిపోవడానికి నాకు కనిపిస్తున్న ప్రధానమైన కారణం, ఇంట్లో పెద్దలు లేకపోవడమే. ఎప్పుడైతే ఇంట్లో పెద్దలు లేకపోవడం మొదలైందో .. ఇంటి దగ్గర ఉండి అడిగేవారు లేరో ..  అప్పటి నుంచి పిల్లలకి పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది. వాళ్ల ఆలోచనలకు అడ్డుకట్ట వేసేవారంటూ లేకుండా పోయారు. భయభక్తులు .. కట్టుబాట్లు చెప్పేవారు లేకుండా పోయారు. ఇక ఈ తరాన్ని చెడగొట్టడంలో ఫోన్ కూడా ముఖ్యమైన పాత్రనే పోషిస్తోంది" అని చెప్పారు.

Muralidhar Goud
Balam movie
marriage problems
divorce rate
signature studios interview
family values
telugu cinema
modern relationships
parental guidance
social issues

More Telugu News