TGPWU: న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం తాగిన వారిని ఉచితంగా ఇంటి వద్ద దించుతారట!

TGPWU Offers Free Rides for Drunk Drivers on New Years Eve
  • న్యూఇయర్ వేళ మందు బాబులకు గిగ్ వర్కర్స్ యూనియన్ ఉచిత రవాణా సేవలు
  • నేటి రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు అందుబాటులో వాహనాలు
  • సేవల కోసం ప్రత్యేకంగా 500 వాహనాలు సిద్ధం చేసిన యూనియన్
  • హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో సేవలు పొందే అవకాశం
  • ఉచిత రైడ్ కోసం 8977009804 నంబర్‌ను సంప్రదించాలని సూచన
నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం సేవించి వాహనాలు నడిపే వారి వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ పార్టీల్లో మద్యం తాగిన వారు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు ఉచిత రవాణా సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు డిసెంబర్ 31 రాత్రి (ఈ రోజు) 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాబ్‌లు, ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లతో కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. పార్టీల అనంతరం సురక్షితంగా ఇంటికి వెళ్లాలనుకునే వారు, తమకు ఉచిత రైడ్ కావాలని కోరుతూ 8977009804 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను నివారించి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని టీజీపీడబ్ల్యూయూ పేర్కొంది. నగర వాసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని యూనియన్ ఆకాంక్షించింది. తాగిన మైకంలో డ్రైవింగ్ చేసే బదులు, తమ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరింది.
TGPWU
Telangana Gig and Platform Workers Union
New Year
Hyderabad
Free Transportation
Drink and Drive
Road Accidents
Cyberabad
Rachakonda

More Telugu News