Khushi Mukherjee: మా మధ్య ఎలాంటి బంధం లేదు.. అంతా అపోహే: సూర్యకుమార్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన నటి

Khushi Mukherjee Clarifies Relationship Rumors with Surya Kumar Yadav
  • సూర్యకుమార్‌తో రిలేషన్‌పై స్పష్టత ఇచ్చిన నటి ఖుషీ ముఖర్జీ
  • తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని వెల్లడి
  • తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన
  • ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని తెలిపిన నటి
  • గతంలో స్నేహితులుగా మాత్రమే మాట్లాిడుకున్నామని వివరణ
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్, టెలివిజన్ నటి ఖుషీ ముఖర్జీ స్పష్టత ఇచ్చారు. ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేదని తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ మాటలను వక్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో సూర్యకుమార్ తనకు మెసేజ్‌లు చేసేవాడ‌ని, చాలామంది క్రికెటర్లు తన వెనుక పడుతున్నారని ఖుషీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ తన భార్య దేవిశాతో కలిసి తిరుమల పర్యటనలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, దీనిపై తాజాగా స్పందించిన ఖుషీ.. అప్పట్లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని, అదే గందరగోళానికి కారణమైందని పేర్కొన్నారు.

"మేము గతంలో స్నేహితులుగా మాత్రమే మాట్లాడుకున్నాం. ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సూర్య నాతో కేవలం ఫ్రెండ్‌గా మాట్లాడాడు. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు మా మధ్య అసలు సంభాషణే లేదు. ఈ వివాదం మొదలయ్యాక కూడా నేను అతడితో మాట్లాడలేదు. ఏదైనా క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని నాకు లేదు" అని ఖుషీ స్పష్టం చేశారు. అలాగే రాబోయే ప్రపంచ కప్ కోసం సూర్యకుమార్, భారత జట్టుకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు 2025లో ఆసియా కప్ టైటిల్ అందించిన సూర్యకుమార్, ఇటీవల బ్యాటింగ్‌లో కాస్త తడబడుతున్నాడు. 2025లో అంతర్జాతీయ టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్, విజయ్ హజారే ట్రోఫీలో రాణించి.. 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందే తిరిగి ఫామ్ అందుకోవాలని సూర్య భావిస్తున్నాడు.
Khushi Mukherjee
Surya Kumar Yadav
Suryakumar Yadav relationship
Bollywood actress
cricketer dating rumors
Indian cricket team
T20 World Cup
Mumbai Indians
Asia Cup
cricket news

More Telugu News