Anvesh Naa Anveshana: ‘నా అన్వేషణ’ అన్వేష్ పై హైదరాబాద్ లో కేసు

Karate Kalyani Files Complaint Against YouTuber Anvesh
  • సనాతన ధర్మం, హిందూ దేవుళ్లపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
  • అభ్యంతరకర కంటెంట్ ను యూట్యూబ్ లో ప్రసారం చేశాడని ఆరోపణ
ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సనాతన ధర్మంపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖపట్టణానికి చెందిన అన్వేష్‌ విదేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ట్రావెల్, లైఫ్ స్టైల్ సహా ఇతరత్రా కంటెంట్ ను తన ఛానల్ లో ప్రసారం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరుపొందాడు. అయితే, ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మండిపడ్డ నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు అన్ సబ్ స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు. అన్వేష్ వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లా దానవాయిగూడేనికి చెందిన జి.సత్యనారాయణరావు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపురంహవేలి ఠాణాలో అన్వేష్‌పై కేసు నమోదైంది. తాజాగా, కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది.
Anvesh Naa Anveshana
Naa Anveshana
Anvesh YouTuber
Karate Kalyani
Hyderabad Police
Sanatana Dharma
Hindu Gods
G Satyanarayana Rao
Vishakapatnam
YouTube Channel

More Telugu News