California Truck Drivers: అమెరికాలోని ప్రవాస ట్రక్ డ్రైవర్లకు ఊరట

California Reverses Decision on Truck Driver Licenses
  • లైసెన్స్ రద్దు విషయంలో వెనక్కి తగ్గిన కాలిఫోర్నియా ప్రభుత్వం
  • గడువు తేదీల్లో సమస్యలు.. ఇటీవల 17 వేల లైసెన్సుల రద్దు
  • ట్రక్ డ్రైవర్లు కోర్టుకెక్కడంతో మార్చి వరకూ లైసెన్స్ ల కొనసాగింపు
అమెరికాలోని ప్రవాస ట్రక్ డ్రైవర్లకు తాత్కాలికంగా ఊరట లభించింది. గడువు తేదీల్లో సమస్యలు ఉన్నాయంటూ కాలిఫోర్నియా ప్రభుత్వం 17 వేల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసింది. దీనిపై ట్రక్ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం తాజాగా వెనక్కి తగ్గింది. 2026 మార్చి వరకూ ఈ లైసెన్స్ లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. చట్టబద్ధంగా లైసెన్స్‌ పొందినవారు అప్పటివరకు వాటిని కొనసాగించవచ్చని వెల్లడించింది.

లైసెన్స్ లను రద్దు చేస్తూ ఇటీవల కాలిఫోర్నియా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై ప్రవాస ట్రక్కు డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ట్రక్కు డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. రవాణా ఏజెన్సీ తప్పులే లైసెన్సుల రద్దుకు కారణమని పౌర హక్కుల సంఘాలు కూడా ఆరోపించాయి. వీటిని సరిదిద్ది, లైసెన్స్‌లు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశాయి.
California Truck Drivers
Truck Drivers
California
Commercial Driving License
CDL
Driving License Renewal
Immigrant Truck Drivers
US Trucking
Trucking Industry
License Suspension

More Telugu News