Roshan: నాన్న పెద్దగా పట్టించుకోడు: శ్రీకాంత్ తనయుడు రోషన్

Roshan Interview
  • హీరోగా ఎదుగుతున్న రోషన్ 
  • 'ఛాంపియన్'తో మరిన్ని మార్కులు 
  • కథల విషయంలో తండ్రి జోక్యం తక్కువని వెల్లడి 
  • తన నిర్ణయానికే వదిలేస్తారని వివరణ

ఇప్పుడు కొత్తగా వస్తున్న యంగ్ హీరోలలో, కాస్త గట్టిగానే నిలబడే హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ కనిపిస్తున్నాడు. చక్కని కనుముక్కుతీరు .. హైటూ .. పర్సనాలిటీ .. ఒక హీరోకి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 'ఛాంపియన్' సినిమా చూసినవారికి రోషన్ పై మరింత నమ్మకం ఏర్పడింది. శ్రీకాంత్ మాదిరిగానే రోషన్ నిలదొక్కుకుంటాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోషన్ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"నా చిన్నప్పటి నుంచి కూడా నాన్న కెరియర్ ను చూస్తూ పెరిగాను. సినిమాలను గురించి నాన్న ఎక్కువగా మాట్లాడతారు గానీ .. అమ్మ ఆ టాపిక్ తీసుకు రాదు. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది .. ఇక్కడ ఎలా నడుచుకోవాలి .. ఎలా మాట్లాడాలి? సక్సెస్ లు వచ్చినప్పుడు .. ఫెయిల్యూర్ లు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? అనే విషయాలను నాన్న చెబుతుండేవారు. పర్సనల్ లైఫ్ దెబ్బతినకుండా సినిమాలను ప్లాన్ చేసుకోవాలని అంటుండేవారు. ఆ మాటలు గుర్తుపెట్టుకుంటాను" అని అన్నాడు. 

"ఇక నా దగ్గరికి వచ్చిన కథల విషయంలో నాన్న పెద్దగా జోక్యం చేసుకోరు. ఒకసారి వినేసి ఏమైనా లోపాలు ఉంటే, అక్కడ ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి వెళ్లిపోతారు. నా నిర్ణయాలు నేనే తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం. అలాగే ఈ జనరేషన్ కి తగినట్టుగానే నా ఆలోచనలు ఉంటాయనే నమ్మకం కూడా ఆయనకి ఉంది. ఒక వైపున ఫ్రెండ్స్ కీ .. ఒక వైపున ఫ్యామిలీకి .. మరొక వైపున సినిమాలకి నాన్న ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు బాగా నచ్చుతుంది" అని చెప్పాడు. 

Roshan
Srikanth son
Roshan Srikanth
Champion movie
Telugu cinema
Tollywood
Telugu movies
hero
interview
career

More Telugu News