Suriya: అభిమాని పెళ్లికి అతిథిగా వచ్చిన హీరో సూర్య.. వధువు రియాక్షన్ వైరల్!
- వధువు కాజల్‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన వరుడు అరవింద్
- సూర్యను చూసి నమ్మలేక ఎమోషనల్ అయిన పెళ్లికూతురు
- నూతన దంపతులను ఆశీర్వదించిన కోలీవుడ్ స్టార్ హీరో
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వధువు రియాక్షన్
తమిళ స్టార్ హీరో సూర్య వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ తాను నిజమైన హీరోనని నిరూపించుకున్నారు. తనను అమితంగా ఆరాధించే అభిమానుల పట్ల తనకు ఎంతటి ప్రేమ ఉందో మరోసారి చాటిచెప్పారు. తాజాగా ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే.. అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కాజల్ కు హీరో సూర్య అంటే ఎనలేని అభిమానం. ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ, అరవింద్ తమ పెళ్లికి సూర్యను ఆహ్వానించారు. అయితే, ఈ విషయం వధువుకు అస్సలు తెలియదు. పెళ్లి జరుగుతున్న సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సూర్య వెడ్డింగ్ హాల్లోకి ప్రవేశించారు. తెలుపు రంగు వస్త్రాలు, కూలింగ్ గ్లాసెస్ ధరించి చాలా నిరాడంబరంగా ఆయన వేదిక వద్దకు వచ్చారు.
అకస్మాత్తుగా తన ఫేవరెట్ హీరోను కళ్లముందుకు రావడం చూసిన వధువు కాజల్ షాక్ అయ్యారు. అది నిజమా? కలనా? అని నమ్మలేక కాసేపు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆనందంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సూర్య స్వయంగా వధూవరుల దగ్గరకు వెళ్లి, వారి చేతులు పట్టుకుని అభినందనలు తెలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సూర్యను చూసినప్పుడు వధువు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అభిమాని కోరిక మేరకు పెళ్లికి వచ్చి సూర్య చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.