Swaroop: కర్ణాటకలో కంబళ పోటీల్లో సరికొత్త రికార్డు.. 10.87 సెకన్లలో 125 మీటర్లు పూర్తి చేసిన స్వరూప్

Swaroop sets new record in Kambala race in Karnataka
  • 8.69 సెకన్లలో 100 మీటర్లను అధిగమించిన మస్తికట్టె స్వరూప్
  • కర్ణాటకలోని మంగళూరులో పోటీలు
  • కర్ణాటక తీర ప్రాంతంలో సంప్రదాయ కంబళ పోటీలు
కర్ణాటకలో సంప్రదాయ కంబళ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా మస్తికట్టె స్వరూప్ అనే యువకుడు దున్నపోతుల పందేల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మంగళూరులో జరిగిన ఈ పోటీల్లో స్వరూప్ 125 మీటర్ల దూరాన్ని కేవలం 10.87 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.

గతంలో శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని 8.78 సెకన్లలో పూర్తి చేయగా, ఆ రికార్డును స్వరూప్ అధిగమించాడు. స్వరూప్ 125 మీటర్లను 10.87 సెకన్లలో పూర్తి చేయడంతో, 100 మీటర్ల దూరాన్ని 8.69 సెకన్లలోనే అధిగమించినట్లయింది.

కర్ణాటక తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఈ గ్రామీణ క్రీడను నిర్వహిస్తారు. గత మూడేళ్లుగా కంబళ రేసులో పాల్గొంటున్నానని, గతంలో జూనియర్ విభాగంలో పాల్గొనేవాడినని స్వరూప్ తెలిపాడు. ఈ ఏడాది తొలిసారి సీనియర్ విభాగంలో పాల్గొని రికార్డు సృష్టించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇది ఊహించని విజయమని పేర్కొన్నాడు.
Swaroop
Kambala
Kambala race
Karnataka
Buffalo race
Srinivasa Gowda
Mangalore
Rural sports

More Telugu News