Jr NTR: ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR Thanks Delhi High Court for Protecting Personality Rights
  • ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణపై ఇటీవల కోర్టు కీలక ఆదేశాలు
  • డిజిటల్ యుగంలో తన హక్కులు కాపాడారంటూ ఎన్టీఆర్ హర్షం
  • న్యాయవాదుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో తన వ్యక్తిగత హక్కులను (పర్సనాలిటీ రైట్స్) కాపాడుతూ న్యాయస్థానం ఇచ్చిన రక్షణ ఉత్తర్వులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన పర్సనాలిటీ హక్కుల పరిరక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, చిత్రం, వాయిస్ వంటివాటిని వాణిజ్యపరంగా గానీ, ఇతర అవసరాలకు గానీ దుర్వినియోగం చేయకుండా ఈ ఉత్తర్వులు నిరోధిస్తాయి.

ఈ న్యాయపోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్‌లతో పాటు రైట్స్ అండ్ మార్క్స్ సంస్థకు చెందిన రాజేందర్, ఆయన బృందానికి కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి నిరంతర మద్దతుకు తాను ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 
Jr NTR
Junior NTR
Delhi High Court
Personality Rights
Balajanaki Srinivasan
Alka Dagar
Rights and Marks
Rajender
Tollywood
Digital Rights

More Telugu News