Allu Arjun: అల్లు అర్జున్ కోసం... బెల్జియంలో మూతపడిన రెస్టారెంట్ తెరుచుకుంది.. ఏం జరిగిందంటే..!

Restaurant in Belgium Reopened for Allu Arjun
  • ఆసక్తికర విషయాన్ని పంచుకున్న లగ్జరీ కాన్సియర్జ్ సర్వీస్ సీఈవో
  • బెల్జియంలో బన్నీ పుట్టినరోజు వేడుకలు
  • అల్లు అర్జున్ కోసం రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా తెరచిన వైనం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు అత్యంత విలాసవంతమైన సేవలను అందించే లగ్జరీ కాన్సియర్జ్‌ సర్వీస్‌ సంస్థ సీఈవో కరణ్‌ భంగే అల్లు అర్జున్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని పంచుకున్నారు. బెల్జియం పర్యటనలో ఉన్న అల్లు అర్జున్‌, ఆయన స్నేహితుల బృందం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు


"అల్లు అర్జున్ బెల్జియం పర్యటనలో ఒక రెస్టారెంట్‌లో పుట్టినరోజు వేడుకను నిర్వహించాలనుకున్నారు. కానీ అది సీజన్‌ కాకపోవడంతో ఆ రెస్టారెంట్ మూతపడింది. అయినప్పటికీ, బన్నీ కోసం ఆ ఒక్క సాయంత్రం మొత్తం రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా తెరిచి, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీని కోసం భారీ మొత్తంలో ఖర్చయిందని... ఆ రెస్టారెంట్ ఒక వారంలో సంపాదించే మొత్తాన్ని ఆ ఒక్క పూటకే చెల్లించారని కరణ్‌ భంగే వివరించారు. 


కేవలం రెస్టారెంట్ తెరవడమే కాదు, అల్లు అర్జున్‌ బృందం కోసం వారి అభిరుచికి సరిపడే భారతీయ వంటకాలు, సంగీతం కూడా ఏర్పాటు చేశారు. తాము చాలా హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల కోసం సేవలు అందించినప్పటికీ... అల్లు అర్జున్‌ బృందం కోరిక మేరకు చేసిన ఏర్పాట్లు ప్రత్యేక అనుభవాన్ని అందించాయి"అని చెప్పారు.


Allu Arjun
Belgium
Luxury Concierge Service
Karan Bhangay
Restaurant
Birthday Celebration
Indian Food
Tollywood
Celebrity
Entertainment

More Telugu News