Unnao rape case: ఉన్నావ్ రేప్ కేస్ దోషికి బెయిల్.. సుప్రీం మాజీ జడ్జి వ్యాఖ్యలు

Markandey Katju Justifies Bail for Unnao Rape Accused Kuldeep Sengar
  • ఎనిమిదేళ్లుగా సెంగార్ జైలులోనే ఉన్నాడన్న మార్కండేయ ఖట్జు
  • చట్ట ప్రకారం సెంగార్ కు జీవిత ఖైదు విధించే అవకాశం లేదని వ్యాఖ్య
  • పోక్సో చట్టం ప్రకారం ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాడన్న ఖట్జు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరోమారు దుమారం రేగింది. అత్యాచారం చేసిన దోషికి బెయిల్ ఇవ్వడంపై బాధితురాలితో పాటు వివిధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జు స్పందిస్తూ.. సెంగార్ కు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించారు. సెంగార్ ఇప్పటికే ఎనిమిదేళ్లకు పైగా జైలు జీవితం గడిపాడని ఖట్జు గుర్తుచేశారు. సెంగార్ ను కోర్టు జీవితాంతం జైలులోనే ఉంచలేదని వ్యాఖ్యానించారు.

పోక్సో చట్టంలో పబ్లిక్ సర్వెంట్ కు సరైన నిర్వచనం లేదని, ఈ చట్టం ప్రకారం ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాదని ఖట్జు గుర్తుచేశారు. మన దేశంలో కేసులు తేలడానికి సుదీర్ఘ సమయం పడుతుందని చెబుతూ.. ఉన్నావ్ రేప్ కేసులో ఇంకా తుది తీర్పు వెలువడలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే ఎనిమిదేళ్లు జైలులో ఉన్న సెంగార్.. ఈ కేసు తేలడానికి మరో పదేళ్లు పడితే అప్పటి వరకూ జైలులోనే ఉండాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇంకో పదేళ్ల తర్వాత కేసు కొలిక్కి వచ్చాక సెంగార్ నిర్దోషి అని తేలితే పద్దెనిమిది సంవత్సరాల జైలు జీవితానికి ఎవరు సమాధానం చెబుతారని ఖట్జు ప్రశ్నించారు.

సెంగార్ కు బెయిల్ మంజూరు చేసే విషయంలో హైకోర్టు ఈ అంశాన్నే ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఖట్జు అభిప్రాయపడ్డారు. ట్రయల్ కోర్టు సెంగార్ ను దోషిగా తేల్చిన విషయాన్ని కానీ, అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ అనే విషయాన్ని కానీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ అంశాలను పక్కన పెడితే.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చిందని జస్టిస్ ఖట్జు గుర్తుచేశారు.
Unnao rape case
Markandey Katju
High Court bail
Kuldeep Singh Sengar
POCSO Act
rape case India
Indian judiciary
Supreme Court
MLA Sengar
bail justification

More Telugu News