Suraj Shivanna: వివాహమైన 45 రోజులకే కట్నం చిచ్చు: భార్య ఆత్మహత్య.. భయంతో భర్త బలవన్మరణం.. తల్లి చావుబతుకుల్లో!

Karnataka Dowry Suicide Case Ends in Family Tragedy
  • బెంగళూరులో భార్య ఆత్మహత్య.. నాగ్‌పూర్‌లో భర్త బలవన్మరణం
  • కట్నం కోసం వేధించారంటూ భర్త సూరజ్ శివన్నపై కేసు పెట్టిన భార్య తరపు వారు
  • అరెస్టు భయంతో నగరం విడిచి నాగ్‌పూర్ పరారైన సూరజ్ కుటుంబం
  • కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన తల్లి
వరకట్న వేధింపుల ఆరోపణలు రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. వివాహమైన కొన్ని రోజుల్లోనే భార్యాభర్తలు ఇద్దరూ తనువు చాలించగా.. ఓ తల్లి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న(35), గానవిలకు నెలన్నర క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం వేధింపుల కారణంగా గానవి గురువారం ఆత్మహత్య చేసుకోవడం ఈ విషాదానికి కారణమైంది.

గానవి మరణంతో ఆమె తల్లిదండ్రులు సూరజ్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయం, గానవి బంధువుల నుంచి వస్తున్న ఒత్తిడి భరించలేక సూరజ్ తన తల్లి జయంతి, తమ్ముడితో కలిసి బెంగళూరు నుంచి పారిపోయాడు. హైదరాబాద్ మీదుగా నాగ్‌పూర్ చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో తలదాచుకున్నాడు.

అయితే, కేసుల గొడవలు, భార్య మరణం మిగిల్చిన వేదనతో సూరజ్ శుక్రవారం రాత్రి హోటల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి జయంతి(60) గుండె పగిలి అక్కడే ఆత్మహత్యకు యత్నించింది. హోటల్ సిబ్బంది గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కేవలం 45 రోజుల క్రితం పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ రెండు ఇళ్లు ఇప్పుడు విషాదంలో మునిగిపోయాయి.
Suraj Shivanna
Dowry harassment
Ganavi suicide
Karnataka news
Bangalore news
Nagpur suicide
Crime news
Suicide case India
Jayanti hospital
Family tragedy

More Telugu News