Suguna Movie: ఓటీటీలోకి కొత్తగా వచ్చిన తెలుగు సినిమాలు ఇవే!

Suguna Baagundi Telugu Movies New on OTT
  • అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన చిత్రాలు 'సుగుణ', 'బాగుంది'
  • అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం 'సుగుణ' 
  • కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాగుంది'
ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. ఇప్పటికే పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా మరో రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.
 
అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం 'సుగుణ' ఇప్పుడు ఓటీటీలో దర్శనమిస్తోంది. 2024లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా చర్చకు రాలేదు. ఎప్పుడు రిలీజై, ఎప్పుడు వెళ్లిపోయిందన్న విషయమే చాలా మందికి తెలియదు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె పద్ధతిలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
 
అదే తరహాలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బాగుంది' సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించగా, కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
 
ఈ రెండు సినిమాల ట్రైలర్లను చూస్తే భారీ అంచనాలు ఏర్పడేలా లేకపోయినా, థియేటర్లలో గుర్తింపు దక్కని ఈ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. 
Suguna Movie
Telugu movies OTT
OTT Telugu releases
Amazon Prime Video
Baagundi Movie
Telugu horror comedy
Dhanraj
Chamack Chandra
Ram Kumar direction

More Telugu News