Sudha Kongara: రజనీకాంత్ తో ప్రేమకథా చిత్రం... దర్శకురాలి డ్రీమ్ ప్రాజెక్ట్

Sudha Kongara Wants to Direct Rajinikanth in a Love Story
  • రజనీకాంత్‌తో ప్రేమకథ తీయాలన్నది తన కల అని చెప్పిన సుధా కొంగర
  • సూపర్‌స్టార్ కోసం ఇప్పటికే ఓ కథ సిద్ధంగా ఉందని వెల్లడి
  • పనిభారంతో అలసిపోయానంటూ రిటైర్మెంట్ ప్రస్తావన
  • ప్రస్తుతం ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకురాలు
ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఓ సినిమా చేయాలన్న తన చిరకాల కోరికను బయటపెట్టారు. అయితే, ఆ సినిమా యాక్షన్ లేదా సందేశాత్మక చిత్రం కాదని, ఓ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమని చెప్పి ఆసక్తి రేకెత్తించారు. ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్లలో సుధా కొంగర బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. రజనీకాంత్ సర్‌తో ఒక పూర్తిస్థాయి లవ్‌స్టోరీ చేయాలన్నది నా కల. నా దగ్గర ఇప్పటికే ఆయన కోసం ఒక కథ కూడా సిద్ధంగా ఉంది. దాన్ని ఇంకాస్త డెవలప్ చేయాలి’’ అని ఆమె తెలిపారు.

ఇదే సమయంలో ఆమె తన రిటైర్మెంట్‌ గురించి కూడా మాట్లాడారు. వరుస సినిమాలతో పనిభారం పెరిగిందని, అందుకే త్వరలోనే రిటైర్ అవ్వాలని అనుకుంటున్నట్లు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ‘పరాశక్తి’ పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. అథర్వ, రవి మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2026 జనవరి 10న విడుదల కానుంది. సుధా కొంగర తాజా వ్యాఖ్యలతో రజనీకాంత్‌తో ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Sudha Kongara
Rajinikanth
Sudha Kongara movie
Rajinikanth love story
Parasakthi movie
Sivakarthikeyan
Srileela
Telugu cinema news

More Telugu News