Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి వేదికపై డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు

Naveen Polishetty Dances with MLA Malla Reddys Daughter in Law
  • 'అనగనగా ఒకరాజు' చిత్రంలోని సాంగ్ లాంచింగ్ వేడుక
  • మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పాట లిరికల్ వీడియో విడుదల కార్యక్రమం
  • నవీన్ పొలిశెట్టి ఎందరికో ఆదర్శమన్న ప్రీతిరెడ్డి
బీఆర్ఎస్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి... ప్రముఖ నటుడు నవీన్ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్‌తో అదరగొట్టారు. 'అనగనగా ఒక రాజు' చిత్రంలోని 'రాజు గారి పెళ్లిరో' పాట లాంచింగ్ వేడుకలో మల్లారెడ్డి కోడలు డ్యాన్స్‌తో అందరినీ అలరించారు.

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒకరోజు'. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.

చిత్ర ప్రచారంలో భాగంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా జరిగిన కార్యక్రమంలో 'రాజు గారి పెళ్ళిరో' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ప్రీతిరెడ్డి, నవీన్ డ్యాన్స్ చేస్తుంటే మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు ఈలలతో ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడం కష్టమని అన్నారు. ఈ పరిశ్రమలో ఎదుగుతుంటే కిందకు లాగేవారు ఎందరో ఉంటారని అన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, నిద్రలేని రాత్రులతో కష్టపడి ఎదుగుతున్న నవీన్ ఎంతోమందికి ఆదర్శమని అన్నారు.
Naveen Polishetty
Malla Reddy
Anaganaga Oka Raju
Preeti Reddy
Meenakshi Chaudhary
Tollywood

More Telugu News