Salary Hike: బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

Man Loses Rs 26 Lakh Job Offer After Boss Verbally Promises To Match It
  • ఉద్యోగికి రూ.26 లక్షల వార్షిక వేతనంతో కొత్త ఆఫర్
  • జీతం పెంచుతానని బాస్ మౌఖిక‌ హామీ ఇవ్వడంతో పాత కంపెనీలోనే కొనసాగిన వైనం
  • కొత్త ఆఫర్ చేజారిన తర్వాత మాట మార్చిన బాస్
  • రాతపూర్వక హామీ లేనిదే నమ్మవద్దని నిపుణుల సూచన
  • ఉద్యోగికి ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో వైరల్
కార్పొరేట్ ప్రపంచంలో మౌఖిక హామీలకు విలువ ఉండదని చాటిచెప్పే ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన బాస్ ఇచ్చిన మాటను నమ్మి, ఏకంగా రూ.26 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌ను వదులుకున్న ఓ ఉద్యోగి చివరికి తీవ్రంగా నష్టపోయాడు. ఈ బాధాకరమైన అనుభవాన్ని ‘ఔట్‌కమ్ స్కూల్’ వ్యవస్థాపకుడు అమిత్ శేఖర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
అమిత్ శేఖర్ విద్యార్థి ఒకరు తన సొంత ఊరికి సమీపంలోని కంపెనీలో రూ.15 లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతనికి మరో ప్రముఖ కంపెనీ నుంచి రూ.26 లక్షల ప్యాకేజీతో ఉద్యోగావకాశం వచ్చింది. దీంతో అతను పాత కంపెనీకి రాజీనామా చేశాడు. ఇది గమనించిన అతని బాస్, జీతం పెంచుతానని, కంపెనీ మారవద్దని మౌఖిక హామీ ఇచ్చాడు.

బాస్ మాటను గుడ్డిగా నమ్మిన ఆ ఉద్యోగి, కొత్త ఆఫర్‌ను తిరస్కరించాడు. కొత్త కంపెనీలో చేరాల్సిన తేదీ ముగిసిన నెల రోజుల తర్వాత బాస్‌తో సమావేశమయ్యాడు. ఆ సమావేశంలో బాస్ మాట మార్చేశాడు. "జీతం ఏమీ పెంచడం లేదు. నీ ప్యాకేజీ రూ.15 లక్షలే ఉంటుంది" అని తేల్చి చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగి షాక్‌కు గురయ్యాడు.

రాతపూర్వకంగా హామీ లేకుండా నమ్మవద్దని తాను ముందే సలహా ఇచ్చానని, కానీ సొంత ఊరికి దగ్గరగా ఉండాలనే కారణంతో అతను ఆ నిర్ణయం తీసుకున్నాడని అమిత్ శేఖర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "విశ్వాసం ముఖ్యమే అయినా, రాతపూర్వక ఒప్పందాలే మనకు రక్షణ" అని ఆయన స్పష్టం చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ, ఇది బాధాకరమైన విష‌య‌మ‌ని, కౌంటర్ ఆఫర్లను ఎప్పుడూ రాతపూర్వకంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు.
Salary Hike
Amit Shekhar
Outcome School
job offer
verbal promise
corporate world
career advice
employment
job market
counter offer

More Telugu News