Tehrik-i-Taliban Pakistan: పాక్ ప్రభుత్వానికి పోటీగా వాయుసేనను ఏర్పాటు చేసుకుంటున్న టీటీపీ!
- పాకిస్థాన్‌కు సవాల్ విసురుతున్న టీటీపీ ఉగ్రసంస్థ
- సొంతంగా వైమానిక దళం ఏర్పాటుకు ప్రణాళిక
- 2026 నాటికి ఎయిర్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తామని ప్రకటన
- కొత్తగా సైనిక జోన్లను ఏర్పాటు చేస్తున్న ఉగ్రవాదులు
- పాక్ భద్రతా దళాలపై పెరిగిన దాడుల నేపథ్యంలో ఈ పరిణామం
పాకిస్థాన్‌కు తలనొప్పిగా మారిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ సైన్యానికి సవాల్ విసురుతూ సొంతంగా వైమానిక దళాన్ని (ఎయిర్‌ఫోర్స్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2026 నాటికి ఈ దళాన్ని సిద్ధం చేస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ కొత్త వైమానిక విభాగానికి సలీం హక్కానీ నాయకత్వం వహిస్తారని టీటీపీ తెలిపింది. అంతేకాకుండా, తమ సైనిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థాగతంగా పలు మార్పులు చేపట్టింది. ప్రావిన్సుల వారీగా కొత్త మిలిటరీ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు, పర్యవేక్షణ కోసం రెండు కొత్త జోన్లను (పశ్చిమ జోన్ - బలోచిస్థాన్, సెంట్రల్ జోన్) స్థాపిస్తున్నట్లు పేర్కొంది. కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022 నవంబరులో పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని టీటీపీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్ ప్రావిన్సుల్లో భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. ఆఫ్ఘనిస్థాన్ భూభాగం నుంచి టీటీపీ దాడులకు పాల్పడుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా, అక్కడి తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
టీటీపీ తాజా ప్రకటనలు, సంస్థాగత మార్పులు పాకిస్థాన్‌కు భవిష్యత్తులో మరింత తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.