Allu Arjun: 2025లో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..!

Allu Arjun Most Searched Tollywood Hero on Google in 2025
  • ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో అల్లు అర్జున్‌దే అగ్రస్థానం
  • రెండో స్థానంలో ప్రభాస్, ఆ తర్వాత మహేశ్‌, పవన్, ఎన్టీఆర్
  • 'పుష్ప-2' భారీ విజయంతో ఏడాది మొత్తం బన్నీ హవా
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏ హీరోపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపారనే ప్రశ్నకు సమాధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. 2025లో గూగుల్‌లో అత్యధికంగా వెతకబడిన టాలీవుడ్ నటుడిగా బన్నీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

గ‌త‌ ఏడాది ఆఖ‌రిలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఆయన పేరు ఈ ఏడాది పొడవునా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఘనవిజయంతో పాటు తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న 'ఏఏ22' ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అంచనాలు కూడా బన్నీ టాప్ ప్లేస్‌లో నిలవడానికి దోహదపడ్డాయి. ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఈ నెల‌ 24 నాటి గూగుల్ డేటా ప్రకారం టాప్-5 జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా, ప్రభాస్ రెండో స్థానంలో నిలిచారు. వారి తర్వాత వరుసగా మహేశ్‌ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నాలుగోసారి కలిసి పనిచేయబోతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతున్న క్రేజ్, బలమైన లైనప్‌తో టాలీవుడ్‌లో అల్లు అర్జున్ హవా మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.


Allu Arjun
Pushpa 2
AA22
Atlee
Prabhas
Mahesh Babu
Pawan Kalyan
Jr NTR
Tollywood
Google Search Trends

More Telugu News