Chandrababu: ఏపీ వ్యవసాయానికి చేయూతనివ్వండి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

Chandrababu Seeks Central Assistance for AP Agriculture Growth
  • కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • విభజన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతి
  • కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు ఏర్పాటుకు సహకరించాలన్న సీఎం
  • సూక్ష్మ సేద్యం విస్తరణకు రూ.695 కోట్లు కేటాయించాలని డిమాండ్
  • ఏపీని సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి పర్యటనలో భాగంగా తనను కలిసిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చంద్రబాబు బలంగా కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. పంచ సూత్రాల ప్రణాళికతో వ్యవసాయంలో 10.70 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. నీటి భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి చేసిన ప్రధాన విజ్ఞప్తులు
రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతానికి సీఎం చంద్రబాబు పలు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. పీఎం కృషి సిచాయి యోజన కింద సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా రూ.695 కోట్లు కేటాయించాలని కోరారు. రూ.200 కోట్ల అంచనాతో కొబ్బరి పార్క్, అత్యాధునిక ఆక్వా ల్యాబ్, రాష్ట్రంలో మామిడి రైతుల కోసం ప్రత్యేకంగా మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వీటితో పాటు ఏపీని సహజ సాగుకు 'జాతీయ వనరుల రాష్ట్రం'గా ప్రకటించాలని, రాబోయే ఐదేళ్లలో 20,000 అదనపు సహజ సాగు క్లస్టర్లను మంజూరు చేయాలని కోరారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు, ఆహార శుద్ధి ఇంక్యుబేషన్ సెంటర్లు, పొగాకు సేకరణకు ఆర్థిక సాయం వంటి అనేక అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు.

Chandrababu
Andhra Pradesh agriculture
Central Agricultural University
Coconut Park
Mango Board
PM Krishi Sinchayee Yojana
Natural farming
Pulicat Lake
Food processing
Agriculture development

More Telugu News