Delhi High Court: ఎయిర్ ఫ్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
- వాయు కాలుష్యం నియంత్రించలేరు.. ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీ కూడా తగ్గించలేరా?
- అడ్వకేట్ దాఖలు చేసిన పిల్ విచారణలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ
ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోతుంటే ఎయిర్ ఫ్యూరిఫయర్లపై కేంద్ర 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోలేరా, అసలు జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించింది. ‘‘కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించలేకపోతున్నారు.. కనీసం ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించడమూ చేతకాదా?” అంటూ కేంద్రాన్ని నిలదీసింది. ఈమేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ, రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ అడ్వకేట్ కపిల్ మదన్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెల ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. స్పందించేందుకు 15 రోజుల సమయం కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని గుర్తు చేస్తూ.. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో వేగంగా నిర్ణయం తీసుకోలేరా.. అంత సమయం దేనికి? ఎంతమంది చనిపోయేదాకా వేచి చూడాలని ప్రశ్నించింది. కనీసం తాత్కాలికంగానైనా మినహాయింపులు ఇవ్వలేరా.. జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోందని నిలదీసింది. వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని సూచించింది. ఈ కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.