Nara Lokesh: ప్రతిపక్షం అంటే ఏమిటి ..? .. లోకేశ్ ఆసక్తికర ట్వీట్ వైరల్

Nara Lokesh Criticizes Opposition Role in Andhra Pradesh
  • అభివృద్ధిని అడ్డుకునే ప్రతినాయకుడిగా జగన్ వ్యవహరిస్తున్నారన్న మంత్రి నారా లోకేశ్
  • ప్రతిపక్షం తీరును ఎండగడుతూ షార్ట్ వీడియోను పోస్టు చేసిన లోకేశ్
  • పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించిన లోకేశ్
ప్రతిపక్షం ప్రజాపక్షం వహించకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. పీపీపీ విధానంలో వైద్య విద్యపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ లోకేశ్ ఓ వీడియోను తన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

పీపీపీ విధానంలో పేద వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని లోకేశ్ అన్నారు. ప్రజలకు మేలు చేసే పీపీపీ విధానంపై జగన్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు.

గత ప్రభుత్వ విధానంతో మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుందని, అదే పీపీపీ విధానంలో అయితే రెండు మూడు సంవత్సరాల్లోనే మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తాయని, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఆయన వివరించారు.

ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రతిపక్షం ఎలా ఉండాలి? ఎలా వ్యవహరించాలి? అనే దానిపై విమర్శనాత్మకంగా లోకేశ్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్రోహ శక్తులు ఎన్ని కుట్రలు చేసినా నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర వైపు నడవడం ఆగదని ఆయన పేర్కొన్నారు. 
Nara Lokesh
Andhra Pradesh
TDP
YSRCP
PPP model
Medical colleges
AP Politics
Opposition party
YS Jagan
Viral tweet

More Telugu News