ఏపీలో పాస్టర్‌లకు సర్కార్ క్రిస్మస్ కానుక ..
- పాస్టర్‌లకు గౌరవ వేతనం బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- పాస్టర్‌లకు రూ.50.50కోట్లు విడుదల
- 8,418 మంది పాస్టర్‌ల ఖాతాల్లో గౌరవ వేతనం బకాయిలు జమ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో పాస్టర్లకు గౌరవ వేతనం బకాయిలు జమ అయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు క్రైస్తవ సోదరుల కుటుంబాల్లో వేడుకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి క్రైస్తవుల ఆపద్బాంధవుడిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.