KTR: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్

KTR Slams Revanth Reddys Comments on KCR
  • ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • 2028లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమన్న కేటీఆర్
  • నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్గిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని అన్నారు. నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు.

నదీ జలాల హక్కులను కాపాడటం చేతకాని అసమర్థుడు అహంకారంతో మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే మోసం చేస్తున్నాడని ఆరోపించారు. అది చాలదన్నట్లుగా కేసీఆర్‌పై ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. సభ్యత, సంస్కారం లేని నీచమైన రేవంత్ రెడ్డి ప్రవర్తనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

ప్రజలు ఛీకొడుతున్నా ఇంకా మారవా అని ఎద్దేవా చేశారు. శాసనసభతో పాటు జనసభలోనూ కాంగ్రెస్ పార్టీ జలద్రోహాన్ని ఎండగడతామని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో వందేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
KTR
Revanth Reddy
Telangana
BRS
Congress Party
KCR
Telangana Politics

More Telugu News