Mysaa Movie: రెబల్ రష్మిక.. ‘మైసా’ గ్లింప్స్‌తో దుమ్మురేపిన ముద్దుగుమ్మ

Rashmika Mandanna as Rebel in Mysaa Action Glimpse
  • తొలిసారి ఫెరోషియస్ యాక్షన్ అవతారంలో రష్మిక
  • గోండు గిరిజన నేపథ్యంతో శక్తిమంతమైన కథ
  • జేక్స్ బిజోయ్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
  • పాన్ ఇండియా స్థాయిలో ‘మైసా’ విడుదలకు సన్నాహాలు
‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో సింపుల్ యువతిగా మెప్పించిన రష్మిక మందన్న, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’ (Mysaa) నుంచి విడుదలైన యాక్షన్ గ్లింప్స్ ఆక‌ట్టుకుంటోంది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక తొలిసారి ఫెరోషియస్ రెబల్ పాత్రలో కనిపిస్తోంది.

గ్లింప్స్‌లో రష్మిక లుక్‌నే కాదు, ఆమె బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించే ఆగ్రహం ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తోంది. ఒళ్లంతా రక్తం, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్‌తో గిరిజన తిరుగుబాటు యువతిగా ఆమె ప్రెజెన్స్ బాగుంది. ఇప్పటివరకు రొమాంటిక్, కమర్షియల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఈసారి పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది.

‘మైసా’ అంటే ‘అమ్మ’ అని అర్థం. గోండు గిరిజన తెగల నేపథ్యంలో సాగే ఈ కథ, అన్యాయానికి ఎదురు నిలిచే ఓ సహజ నాయకురాలి పోరాటాన్ని చూపించనుందని సమాచారం. స్వేచ్ఛ, బాధ, ప్రతీకారం, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేసింది.

అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పుష్ప 2’లో విలన్‌గా మెప్పించిన తారక్ పొన్నప్ప ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘మైసా’, రష్మిక కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Mysaa Movie
Rashmika Mandanna
Rebel Rashmika
Ravindra Pulle
Tarak Ponnappa
Gond Tribe
Action Drama
Pan India Movie
Telugu Cinema
National Crush

More Telugu News