Canara Bank: ఏఐ ఫీచర్స్‌తో కెనరా బ్యాంక్ కొత్త యాప్ ..ప్రత్యేకతలు ఇవీ
- ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్
- ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు
- గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న కొత్త యాప్
ఏఐ ఫీచర్లతో కెనరా బ్యాంక్ నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించింది. ఇది గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇతర యూపీఐ యాప్‌లలో రిజిస్టర్ అయిన కెనరా బ్యాంక్ ఖాతాదారులు సైతం సులభంగా మార్చుకోవచ్చు. కెనరా ఏఐ 1పే పేరుతో కొత్త యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ప్రారంభించింది.
ఈ యాప్ ద్వారా ఏ బ్యాంకు ఖాతానైనా లింక్ చేసుకొని వేగంగా, సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు, చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యక్తులు సైతం సులభంగా చెల్లింపులు స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, నెలవారీ ఖర్చుల విశ్లేషణ, కేటగిరీల వారీగా వివరాలు, ఆర్థిక ట్రెండ్స్ వంటి ఆర్థిక నిర్వహణకు సహాయపడుతుంది. హోమ్ స్క్రీన్ లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి త్వరగా చెల్లింపులు జరపవచ్చు. చిన్న మొత్తాలను చెల్లించేందుకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బిల్లులు, సబ్ స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఎస్ఐపీల ఆటోమెటిక్ చెల్లింపులు కూడా చేసుకోవచ్చు.
భద్రత విషయానికి వస్తే బయోమెట్రిక్ లాగిన్, డివైజ్ బైండింగ్ (రిజిస్టర్ మొబైల్ నుంచి మాత్రమే లావాదేవీలు) వంటి మల్టీ లెవెల్ సెక్యూరిటీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అనుమానాస్పద లావాదేవీలను తక్షణం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది.