Aditya Dhar: అల్లు అర్జున్ పుష్ప-2 హిందీ రికార్డులను బద్దలుగొట్టిన ‘ధురంధర్’
- రూ. 900 కోట్ల క్లబ్‌కు చేరువలో ఆదిత్య ధర్ యాక్షన్ థ్రిల్లర్
- మూడో వారంలోనూ కలెక్షన్ల జోరు
- ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు
ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మంగళవారం నాటి అంచనాల ప్రకారం ఈ చిత్రం రూ. 17.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 589.50 కోట్లకు చేరుకున్నాయి. తాజాగా ఈ చిత్రం అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’ నెలకొల్పిన కీలక రికార్డును అధిగమించడం విశేషం.
గత ఏడాది డిసెంబర్‌లో ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ మూడో వారం మొత్తం మీద రూ. 103 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ‘ధురంధర్’ చిత్రం మూడో వారం మొదటి నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 111.75 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఇక, అంతర్జాతీయంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 876.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీని ద్వారా ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ (రూ. 852.31 కోట్లు) రికార్డును దాటి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా మొదటి వారంలో రూ. 207.25 కోట్లు, రెండో వారంలో రూ. 253.25 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మూడో వారం సోమవారం నాడు రూ. 16.5 కోట్లతో స్వల్పంగా తగ్గినప్పటికీ, మంగళవారం మళ్లీ పుంజుకుంది. మంగళవారం రాత్రి సమయానికి థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు 35.88 శాతానికి పెరగడం గమనార్హం.
అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. పాకిస్థాన్‌లోని లియారీలో ఉన్న బలోచ్ గ్యాంగ్‌లోకి చొరబడే 'హంజా' అనే భారతీయ ఏజెంట్ కథాంశంతో ఈ యాక్షన్ డ్రామా సాగుతుంది. ధురంధర్ సినిమా ఘనవిజయం సాధించడంతో నిర్మాతలు ఇప్పటికే దీనికి సీక్వెల్‌ను ప్రకటించారు. ‘ధురంధర్ 2’ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.