Sivaji: హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ.. ఏమన్నారంటే?

Sivaji Apologizes for Comments on Heroines Clothing
  • మంచి మాటలు చెప్పే ఉద్దేశంతో రెండు అసభ్య పదాలను ఉపయోగించానని వ్యాఖ్య
  • ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరిన శివాజీ
  • ఎవరినీ అవమానించడానికి అలా మాట్లాడలేదని వెల్లడి
  • కానీ దుస్తుల విషయంలో హీరోయిన్లు జాగ్రత్తగా ఉంటే వారికే మంచిదని వ్యాఖ్య
హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో నటుడు శివాజీ క్షమాపణలు తెలిపారు. మంచి విషయాలు చెప్పే క్రమంలో రెండు అసభ్య పదాలను వాడినందుకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరారు. తాను ఎవరినీ అవమానించే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.

మహిళలందరినీ ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మంచి మాటలు చెబుతూనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. తాను గ్రామ భాషలో మాట్లాడానని, అది తప్పేనని పేర్కొన్నారు. అలాంటి పదాలు వాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

సమాజంలో స్త్రీని తక్కువగా చూపిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలను ఎవరూ తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతో తాను అలా మాట్లాడానని తెలిపారు. హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది వారికే మంచిదని శివాజీ సూచించారు.
Sivaji
Sivaji apology
Telugu actor Sivaji
Heroine comments
Movie actress
Film industry

More Telugu News