GHMC: ఆస్తి పన్ను చెల్లింపుపై నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే శుభవార్త

GHMC Announces Good News for Hyderabad Residents on Property Tax
షార్ట్స్‌లో చూడండి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆస్తి పన్నుకు సంబంధించి సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులపై వన్ టైమ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90 శాతం వరకు రాయితీ పొందవచ్చని నగరవాసులకు శుభవార్తను అందించింది.

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల పెండింగ్ బకాయిలపై ఈ రాయితీ ఇవ్వబడుతుంది. వినియోగదారులు కేవలం ఆస్తి పన్నులో వడ్డీని 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలియజేశారు.

వారికీ వర్తింపు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించిన విషయం తెలిసిందే. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ ద్వారా ప్రజలపై భారం తగ్గడంతో పాటు జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
Go Back to Shorts
GHMC
GHMC property tax
Greater Hyderabad Municipal Corporation
Property tax Hyderabad
Hyderabad property tax

More Telugu News