Sudheer Babu: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో నేరాలు పెరిగాయి: సీపీ సుధీర్ బాబు

Sudheer Babu Rachakonda Crime Rate Increased in 2025
  • 2024తో పోలిస్తే పెరిగిన నేరాల సంఖ్య
  • మహిళలపై 4 శాతం పెరిగిన నేరాలు
  • సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేసినట్లు వెల్లడి
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో నేరాలు పెరిగాయని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. 2024 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. 2024లో 28,626 కేసులు నమోదు కాగా, 2025లో 33,040 కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం 579 కిడ్నాప్ కేసులు... 1,224 పోక్సో కేసులు... 73 హత్యలు... 330 అత్యాచారాలు నమోదయ్యాయి.

మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 4 శాతం పెరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసుల్లో మొత్తం 668 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 21,056 కేసులను పరిష్కరించినట్లు సీపీ తెలిపారు. 12 కేసుల్లో దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు.

సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని అన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న 495 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు 322 మంది, ఇతర రాష్ట్రాల వారు 172 మంది, ఒక విదేశీయుడు ఉన్నట్లు తెలిపారు. 
Sudheer Babu
Rachakonda
crime rate
Hyderabad crime
cyber crime
POCSO cases
drug bust

More Telugu News