Vangalapudi Anitha: మేక తలలు నరికి, రక్తాభిషేకాలు చేయిస్తున్నారు: అనిత ఫైర్

Vangalapudi Anitha Fires at YSRCP Over Goat Sacrifices
  • చిన్నపిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారన్న అనిత
  • నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని మండిపాటు
  • వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్య
వైసీపీపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా తయారైందని మండిపడ్డారు. చిన్నపిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని విమర్శించారు. మేక తలలు నరికి, రక్తాభిషేకాలు చేయిస్తూ వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని దుయ్యబట్టారు. రౌడీ మూకలను కంట్రోల్ చేయడం, శాంతిభద్రతలను కాపాడటం పోలీసులకు సవాలుగా మారిందని అన్నారు. 

వైద్య కళాశాలల పీపీపీ విధానంలో భాగస్వాములైన వారిని అరెస్ట్ చేస్తామని జగన్ వార్నింగ్ ఇవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లోనే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. 

రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశామని అనిత చెప్పారు. గంజాయి సాగును జీరోకు తీసుకొచ్చామని తెలిపారు. గంజాయి రవాణా చేసేవారిని పట్టుకుని కేసులు పెడుతున్నామని చెప్పారు. వైసీపీ నాయకులపై తాము కక్ష పెట్టుకోలేదని... కక్షసాధింపులకు పాల్పడితే వైసీపీ నాయకులు రోడ్లపై తిరుగుతారా? అని ప్రశ్నించారు.
Vangalapudi Anitha
Vangalapudi Anitha comments
YSRCP criticism
Andhra Pradesh politics
TDP government
Ganja free Andhra Pradesh
Eagle team
Law and order Andhra Pradesh
Goat sacrifice controversy
Jagan Mohan Reddy

More Telugu News