Aditya Dhar: రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై 'ధురంధర్' డైరెక్టర్ భావోద్వేగ స్పందన

Aditya Dhar responds emotionally to Ram Gopal Varmas tweet on Dhurandhar
  • 'ధురంధర్'తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఆదిత్య ధర్
  • భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశావంటూ వర్మ కితాబు
  • ధైర్యంగా సినిమా తీయడాన్ని మీ నుంచే నేర్చుకున్నానన్న ఆదిత్య ధర్
రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రూ. 700 కోట్ల వసూళ్లను దాటేసింది. ఈ చిత్రంపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేశారు. 'ఆదిత్య ధర్, నీవు భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశావు' అంటూ కితాబునిచ్చారు. నీ దర్శకత్వం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్ పై ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు. 

తన అభిమాన దర్శకులలో వర్మ ఒకరని... భయం అంటే ఏమిటో తెలియకుండా సినిమా తీయడాన్ని మీ నుంచే నేర్చుకున్నానని ఆదిత్య ధర్ అన్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు మీ ప్రభావం తనపై చాలా ఉందని తెలిపారు. మీ సినిమాలు కొన్నిసార్లు తన తలలో గుసగుసలాడేవని, మరికొన్ని సార్లు గట్టిగా అరిచేవని చెప్పారు. ఈ ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. 

అప్పట్లో అవి తాను చేసినవి రిస్కులు అని తనకు తెలియదని వర్మ అన్నారు. తన అజ్ఞానంతో తనకు తోచినవి చేశానని తెలిపారు. సినిమా హిట్ అయితే దూరదృష్టి అన్నారని... ఫెయిల్ అయితే కళ్లు లేవు అన్నారని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Aditya Dhar
Ram Gopal Varma
Dhurandhar movie
Ranveer Singh
Bollywood
Indian cinema
Director
RGV tweets
Movie success
Aditya Dhar interview

More Telugu News